కోనసీమ: మలికిపురం మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు, గుబ్బలపాలెం MPTC కందికట్ల నిర్మల అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. TDP సీనియర్ నాయకురాలైన నిర్మల మృతి పట్ల ఆ పార్టీ శ్రేణులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి. ఆమె మరణం పార్టీకి తీరని లోటని రాజోలు నియోజకవర్గ TDP ఇంఛార్జ్ గొల్లపల్లి అమూల్య పేర్కొన్నారు. నిర్మల కుటుంబ సభ్యులకు పార్టీ నేతలు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మలికిపురం ఎంపీటీసీ నిర్మల కన్నుమూత


