హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జీజీహెచ్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ.. సుమారు 40 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి మరణించినట్లు కొత్తపేట పోలీసులు మంగళవారం తెలిపారు. మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు వెల్లడించారు. మృతుడికి సంబంధించి ఎలాంటి వివరాలు తెలిసినా వెంటనే తమ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని అధికారులు సూచించారు.