హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎల్‌నినో ముప్పును తట్టుకొని నాట్లేస్తున్న రైతులు!

అన్నమయ్య: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు అలముకున్నా పెద్దమండ్యం - చిన్నమండ్యం రహదారిలోని కొత్తగడ్డ కాలనీ వద్ద రైతన్నలు సాగు పనుల్లో వెనకడుగు వేయడం లేదు. ఆరుతడి పంటలు వేసుకోవాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ, ఉన్న నీటిని నమ్ముకుని వరి నాట్లు వేస్తున్నారు. కొండల నడుమ ఈ పచ్చని పొలాలు దారిపోయే ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి.