హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడకు భారీగా నిధుల మంజూరు

NTR: హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) కింద విజయవాడ నగరానికి రూ.140 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో మట్టి రోడ్లను సీసీ రోడ్లుగా మార్చడం, పార్కులు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం డీపీఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో టెండర్లు పిలిచి పనులు అప్పగించనున్నారు.