PLD: సత్తెనపల్లి ఆర్‌టీసీ బస్టాండ్‌ను మూడు జోన్ల ఇన్‌ఛార్జ్ ఈడీఈ ఎం.జగదీష్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్లాట్‌ఫారాలు, తాగునీరు, పారిశుద్ధ్యాన్ని పరిశీలించి, ప్రయాణికులను సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో సమీక్ష నిర్వహించిన ఆయన, బస్సుల సమయపాలన, ప్రయాణికుల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
బస్టాండ్‌లో ఈడీఈ ఆకస్మిక తనిఖీ


