హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కిడ్నీ బాధితుడికి ఆర్థిక సాయం అందజేత

W.G: అత్తిలి మండలం కె.సముద్రపుగట్టుకు చెందిన కట్టా శ్రీనివాసరావు కుటుంబానికి భగవాన్ పూతరేకులు సంస్థ తరఫున రూ. 16,116 నగదును మంగళవారం అందజేశారు. కిడ్నీ సమస్య బారిన పడి డయాలసిస్ చేయించుకుంటున్న బాధితుడికి ఆర్థికంగా అండగా ఉండాలని ఆర్థిక సాయం చేసినట్లు శిరిగినీడి నాగేశ్వరరావు (నాగు) తెలిపారు. దాతలు శ్రీనివాసరావు కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు రావాలన్నారు.