హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పింఛను కోసం వృద్ధురాలి పడిగాపులు

PPM: సీతానగరం మండలం జోగింపేట గ్రామానికి చెందిన ముని సుబ్బమ్మ భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తోంది. వితంతు పింఛను గానీ, వృద్ధాప్య పింఛను గానీ అందడం లేదు. పింఛను కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎలాంటి ఆధారం లేక బతకడమే కష్టంగా ఉందని, తన పరిస్థితిని చూసైనా అధికారులు స్పందించి పింఛను మంజూరు చేయాలని వేడుకుంటోంది.