హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్

ఏలూరు జిల్లాలో మంగళవారం ఉదయాన్నే రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కొయ్యలగూడెం మండలం దిప్పకాయలపాడు గ్రామానికి చెందిన వృద్ధుడు ఆసుపోయిన వెంకటేశ్వరరావు మృతి చెందారు. ఉపాధి పనులకు వెళ్తున్న వెంకటేశ్వరరావును తూర్పు కాలవ వంతెనపై ఓ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.