హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు సంగీత దిగ్గజం చక్రవర్తి జయంతి

GNTR: చక్రవర్తిగా ప్రసిద్ధి చెందిన సంగీత దర్శకుడు, గాయకుడు కొమ్మినేని అప్పారావు 1936 సెప్టెంబర్‌ 8న గుంటూరు జిల్లా పొన్నెకల్లులో జన్మించారు. 1971–1989 మధ్య తెలుగు సినీ సంగీతంలో మకుటంలేని మహారాజుగా వెలిగారు. దాదాపు 960 చిత్రాలకు సంగీతం అందించారు. 1989లో విడుదలైన 95 చిత్రాల్లో 66 సినిమాలకు సంగీతం అందించి రికార్డు సృష్టించారు. 2002లో కన్నుమూశారు.