హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

PLD: నరసరావుపేటలోని టీట్కో గృహాల వద్ద రాత్రి గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. సుమారు 35–40 ఏళ్ల వయసున్న మృతుడు నలుపు రంగు ఫుల్‌హ్యాండ్స్‌ టీషర్ట్‌ ధరించి ఉన్నాడు. కుడి చేతికి ఎరుపు రంగు దారం ఉంది. ట్రైన్‌ నంబర్‌ 18463 ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.