హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళలకు అండగా పోలీస్ శాఖ

AKP : నాతవరం మండలం పీకే గూడెం గ్రామంలో రూరల్ సిఐ రేవతమ్మ పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె గ్రామస్తులతో కలిసి బస చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రానున్న పంచాయతీ ఎన్నికల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, గ్రామస్తులు తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. మహిళలకు అండగా పోలీస్ శాఖ ఉంటుందని అభయ కార్యక్రమం ఉందన్నారు.