ATP: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని SP జగదీష్ మంగళవారం కోరారు. మంటపాల ఏర్పాటు అనుమతుల కోసం https://ganeshutsav.net వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. మైకులు ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకే వాడాలని, డిజేలపై నిషేధం ఉందని స్పష్టం చేశారు. ఫైర్, విద్యుత్ భద్రత పాటించాలని, సమస్యలు ఉంటే డయల్ 112ను సంప్రదించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మైకులకు టైమింగ్.. డీజేలపై నిషేధం: ఎస్పీ


