అనంతపురంలో జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలతో నాల్గవ పట్టణ పోలీసులు, ఈగల్ సెల్ అధికారులు మంగళవారం ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’ నిర్వహించారు. విద్యాసంస్థల పరిసరాల్లో దుకాణాల్లో తనిఖీలు చేపట్టి, నిషేధిత వస్తువులు విక్రయిస్తున్న 5 దుకాణాల యజమానులకు జరిమానా విధించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హనుమంతు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
అనంతపురంలో ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’


