హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలికను లాడ్జికి తీసుకెళ్లిన వ్యక్తిపై ఫోక్సో కేసు

CTR: రామకుప్పంలో 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు రామకుప్పం SI మారెప్ప తెలిపారు. ఈ నెల 4న పలమనేరులోని మావయ్య ఇంటికి బస్సులో వెళ్తున్న మైనర్ బాలికను నమ్మించి అబ్దుల్ అనే వ్యక్తి ఒక లాడ్జికి తీసుకెళ్లి నిర్బంధించాడని, బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అతడిపై ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.