హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదోని -పత్తికొండ రూట్‌లో బస్సులు నడపాలి..!

KRNL: ఆదోని-పత్తికొండ రూట్‌లో విద్యార్థులకు బస్సులను సమయానికి నడపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినీలు సోమవారం రాత్రి ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించారు. బస్సులు లేక కళాశాలలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. PDSO టౌన్ సెక్రెటరీ బంగార్రాజు విద్యార్థుల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు.