హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మచిలీపట్నంలో గోవా షిప్ యార్డ్

కృష్ణా: మచిలీపట్నంలో రూ.8 వేల కోట్లతో షిప్‌యార్డ్ నిర్మాణానికి గోవా షిప్‌యార్డ్ ప్రతిపాదనలు సమర్పించింది. 2025 నవంబర్‌లో విశాఖ సమ్మిట్‌లో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఐదేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేయనుండగా, తొలి దశను 2028 నాటికి పూర్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 3 వేల మందికి ఉపాధి లభించనుంది.