GNTR: తుళ్లూరు(M) దొండపాడు సీడ్ యాక్సిస్ వద్ద సోమవారం రాత్రి ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టిన ప్రమాదంలో అంబడిపూడికి చెందిన వెంకటేశ్వర్లు (50) అక్కడికక్కడే మృతి చెందారు. బైక్‌పై ఉన్న మరొక వ్యక్తి గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా శనివారం కూడా ఇదే ప్రాంతంలో టిప్పర్ ఢీకొని ఒకరు మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సీడ్ యాక్సిస్ వద్ద ప్రమాదం..వ్యక్తి దుర్మరణం


