హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏమాత్రం అజాగ్రత్తైనా వాగులోకే

ADB: ఉట్నూరు శ్యాంపూర్, నాగాపూర్‌తో పాటు, దంతనపల్లి, బీర్సాయిపేట, ఎందా గ్రామాల సమీపాన వంతెనల మీదుగా రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఆయా వంతెనలు శిథిలావస్థకు చేరడంతో పాటు వాటికి రక్షణ గోడలు లేవు. రాత్రి సమయాన ఏ మాత్రం వాహనాలు నడిపినా నేరుగా వాగులోకి దూసుకెళ్లి ప్రమాదాల బారిన పడే దుస్థితి నెలకొంది. వంతెనలకు రక్షణ గోడలు, అవసరమైన చోట నూతన వంతెనలు నిర్మించాల్సిన అవసరం ఉంది.