BHPL: చిట్యాల మండలం తిరుమలాపురం శివారులో బోడగుట్ట నుంచి ఎర్ర మట్టి తరలిస్తున్న టిప్పర్లను గ్రామానికి చెందిన దళితులు సోమవారం అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా రాళ్లు, దుంగలు వేసి నిరసన తెలిపారు. కొడవటంచ దేవస్థానం అభివృద్ధి పనుల పేరుతో గుట్టను తవ్వి మట్టి తరలిస్తున్నారని వారు ఆరోపించారు. ఎస్సై సతీశ్ ఘటనా స్థలానికి చేరుకుని,చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తెలంగాణ
మట్టి తరలిస్తున్న టిప్పర్ల అడ్డగింత


