JGL: ఆరు ఎకరాల భూమి తీసుకుని తనను ఒంటరిగా వదిలేశారని మెట్‌పల్లి ఆరపేటకు చెందిన వృద్ధురాలు చౌటుపల్లి సత్తమ్మ ప్రజావాణిలో కన్నీటి పర్యంతమైంది. భర్త చనిపోయి మూడేళ్లయిందని, ఇద్దరు కొడుకులు, కూతురు ఆస్తి పంచుకుని పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేసి, కొడుకులు పోషణ బాధ్యత తీసుకునేలా చూడాలని అధికారులను వేడుకుంది.
తెలంగాణ
తల్లిని వదిలేసిన కుమారులు, కూతురు


