హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దొనకొండ భూసేకరణపై కలెక్టర్ కీలక ఆదేశాలు

ప్రకాశం: దొనకొండలో పరిశ్రమల ఏర్పాటుకు 2500 ఎకరాల భూమిసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజాబాబు సూచించారు. పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ పరిశ్రమల కోసం భూమి కోరగా రూ.86 కోట్లను డిపాజిట్ చేయాలని యాజమాన్యానికి సూచించారు.సేకరించిన భూమిని డీఆర్డీవోకు అందించాలన్నారు.