అనకాపల్లి జిల్లాలో ప్రస్తుత రుతుపవనాల కాలంలో 54.85 శాతం లోటు వర్షపాతం నమోదైనందున, నీటి వనరులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ సోమవారం ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రాజెక్టుల్లో నీటిమట్టం తగ్గిందన్నారు. రైతులకు సాగునీరు సమానంగా అందేలా అవసరమైన చోట వారాబందీ పద్ధతిని పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'లోటు వర్షపాతం.. నీటి వనరులపై నిఘా ఉంచండి'


