అన్నమయ్య: మదనపల్లె పూలవీధికి చెందిన గణేష్ గ్రూపు మాజీ లీడర్ స్వరూప రూ.2.10 లక్షలు తీసుకుని తిరిగి చెల్లించడం లేదని సభ్యులు మధుమాలతి, లక్ష్మీదేవి, మంగమ్మ, తదితరులు ఫిర్యాదు చేశారు. పీజీఆర్ఎస్‌లో ఎస్పీ ధీరజ్‌కు ఫిర్యాదు చేస్తూ, డబ్బులు అడిగితే దౌర్జన్యం, రాజకీయ పలుకుబడి పేరుతో బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. బ్యాంకు అధికారులు తమపై ఒత్తిడి చేస్తున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్
మదనపల్లెలో గ్రూపు డబ్బుల వివాదం


