హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గణేష్ మండపాలకు అనుమతులు తప్పనిసరి'

NLR: అల్లూరు మండల వ్యాప్తంగా గణేష్ మండపాలు, పందిళ్లు ఏర్పాటు కోసం నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్ లైన్‌లో అనుమతులు పొందాలని ఎస్సై శ్రీనివాసుల రెడ్డి మంగళవారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన సింగిల్ విండో విధానం ద్వారా మండపాల ఏర్పాటు, ఊరేగింపులు అనుమతులు పొందవచ్చున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.