హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

నెల్లూరు నగరంలోని ఏకే నగర్ సబ్ స్టేషన్ పరిధిలో 11 కె.వి త్యాగరాజ నగర్ ఫీడర్లో నూతన లైన్లు ఏర్పాటు చేస్తున్నందున మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. జ్యోతి నగర్, అయ్యప్ప గుడి ప్రాంతం, తదితర ప్రాంతాల్లో కరెంటు ఉండదన్నారు. ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కరెంటు నిలిపివేస్తామన్నారు.