ELR: అనారోగ్య కారణాలతో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన సోమవారం ఏలూరు త్రీటౌన్ పరిధిలో చోటుచేసుకుంది. దుగ్గిరాలకు చెందిన భరణిధర్ (39) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా భార్యా భర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. మద్యానికి బానిసైన భరణిధర్ ఉరివేసుకుని మృతిచెందినట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న ఎస్సై రమేష్ వివరాలు సేకరించారు.
ఆంధ్రప్రదేశ్
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి


