ELR: పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల్లో 1,500 మందికి ఈ నెలాఖరులోగా పునరావాస కాలనీల్లో గృహ ప్రవేశాలు చేయించాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. డిసెంబర్లోగా మొదటి దశ నిర్వాసితులందరినీ కాలనీలకు తరలించేలా నెలవారీ లక్ష్యాలతో పనులు వేగవంతం చేయాలన్నారు. ఇళ్లతో పాటు రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, పాఠశాలల సదుపాయాలు పూర్తి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెలాఖరులోగా పోలవరం నిర్వాసితుల గృహ ప్రవేశాలు


