NDL: నంద్యాల మండలం అయ్యలూరు గ్రామంలో ఇవాళ దశరథ్ పై తమ్ముడు శేఖర్ స్క్రూ డ్రైవర్‌తో దాడి చేశాడు. ఈ దాడిలో దశరథ్‌కు తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలతోనే ఈ దాడి జరిగినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకొని దాడి ఘటనపై బాధితుడుని అడిగి తెలుసుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
స్క్రూ డ్రైవర్‌తో అన్నపై దాడి


