ప్రకాశం: సంతనూతలపాడు మండల పరిధిలోని ఎండ్లూరు డొంక వద్ద మహిళా ప్రాంగణంలో మహిళలకు ఉచితంగా బ్యూటీషియన్ కోర్సుపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ మాధవి సోమవారం తెలిపారు. ఆసక్తి కలిగిన 15 -40 సంవత్సరాల వయసుగల నిరుద్యోగ మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. మరిన్ని వివరాల కోసం మహిళా ప్రాంగణానికి రావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నిరుద్యోగ మహిళలకు ఉచిత శిక్షణ


