హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జూద స్థావరంపై పోలీసుల మెరుపు దాడి

PPM: బలిజిపేట మండలంలోని నారంనాయుడు వలస గ్రామ శివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై బలిజిపేట పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ఎస్‌ఐ రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడిలో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.8,220 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ గేమింగ్ యాక్ట్ సెక్షన్ 9(1) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.