హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉండవల్లితో మాజీ ఎంపీ మార్గాని భరత్ భేటీ

E.G: రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్‌ను మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన నివాసానికి వెళ్లిన భరత్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇద్దరూ కొద్దిసేపు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.