హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గండికోటకు నిలిచిన కృష్ణా జలాలు

KDP: అవుకు జలాశయం నుంచి గండికోట ప్రాజెక్ట్‌కు కృష్ణా జలాల విడుదలను నిలిపివేసినట్లు జలవనరుల శాఖ EE ఉమామహేశ్వర్లు తెలిపారు. నిన్న అవుకు జలాశయంలోకి 100–150 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. గత నెల 28న విడుదల చేసిన నీటితో గండికోటకు 1.396 TMCలు చేరాయన్నారు. శ్రీశైలం ఎగువన వరద ప్రవాహం తగ్గడంతో నీటి విడుదల నిలిపివేశారు. గండికోట ప్రస్తుత సామర్థ్యం 13.9 TMCల నిల్వ ఉందన్నారు.