హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెద్దాపురంలో నేటి నుంచి సామాజిక సర్వే: కమిషనర్

KKD: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పెద్దాపురంలో సెప్టెంబర్ 8 నుంచి 12 వరకు ఓటర్ల జాబితా ఆధారంగా సామాజిక సర్వే నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సామాజిక, కుల గణన చేపట్టాలని ఎన్నికల సంఘం ఆదేశించిందన్నారు. ఓటు హక్కు ఆధారంగా నిర్వహించే సామాజిక సర్వేకు ప్రజలంతా సహకరించాలన్నారు.