హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌పై కోర్టు కఠిన తీర్పు

KRNL: మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడిపిన నందవరం గ్రామానికి చెందిన వడ్డే వినోద్‌కు ఎమ్మిగనూరు ఫస్ట్‌క్లాస్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ 7 రోజుల జైలు శిక్ష విధించారు. మద్యం సేవించి వాహనం నడుపుతుండగా వినోద్‌ను కోర్టు కానిస్టేబుల్‌ భాస్కర్‌ సోమవారం కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయమూర్తి శిక్ష విధించినట్లు SI తిమ్మారెడ్డి తెలిపారు.