KKD: కోటనందూరు భోగలింగేశ్వరస్వామి ఆలయంలో ఇటీవల చోరీ జరిగింది. ఆలయంలోని సుమారు మూడు కిలోల వెండి ధారాపాత్రను దొంగలు అపహరించుకుపోయారు. ఘటనపై దేవాదాయ శాఖ ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది పొడవునా శివలింగంపై ధారగా జలం పడే ధారాపాత్ర చోరీ కావడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
భోగలింగేశ్వర ఆలయంలో చోరీ.. దొరకని ఆధారాలు


