హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు సొంఠంవారిపల్లిలో గ్రామ సభ

అన్నమయ్య: సుండుపల్లె (M) సొంఠవారిపల్లి సచివాలయం వద్ద ఇవాళ ఉదయం 11 గంటలకు గ్రామసభ నిర్వహించనున్నట్లు MPDO సుధాకర్ రెడ్డి తెలిపారు. 2020లో గుండ్లపల్లి, సొంఠవారిపల్లి పంచాయతీల విలీనంపై ప్రజల అభ్యంతరాల నేపథ్యంలో గ్రామసభ ఏర్పాటు చేశారు. 2 పంచాయతీలను వేర్వేరుగా కొనసాగించాలన్న ప్రజల అభిప్రాయాలను సేకరించనున్నారు. ప్రజలు హాజరై తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు.