హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అప్పు డబ్బులు అడిగిన మహిళపై దాడి

W.G: మొగల్తూరు మండలం కొత్తోటకు చెందిన నాగమణి టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తోంది. నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన వెంకటలక్ష్మికి రూ.6 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు తెలిపింది. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా ఆగస్టు 1న నలుగురు వ్యక్తులు తన ఇంట్లోకి చొరబడి దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై మొగల్తూరు ఎస్సై సీహెచ్ జయలక్ష్మి కేసు నమోదు చేశారు.