W.G: వీరవాసరం పాలిటెక్నిక్ వెనుక ఉన్న 150 ప్లాట్ల నాన్-లేఅవుట్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ స్థానికులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. పంచాయతీ సెక్రటరీ, ఎంపీడీవోకు ఫిర్యాదు చేసినప్పటికీ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని, సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని బాధితులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
అక్రమ సెల్ టవర్ నిర్మాణంపై కలెక్టర్‌కు ఫిర్యాదు


