హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలి: ఎమ్మెల్యే

W.G: ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్లకు అర్హులైన వారంతా ఈనెల 16వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కోరారు. దరఖాస్తుదారులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో ఇబ్బందులు తలెత్తితే సచివాలయాలు లేదా మీ-సేవ కేంద్రాల ద్వారా వెంటనే అందేలా కూటమి నాయకులు, కార్య కర్తలు సహాయసహకారాలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు.