హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా వ్యవసాయ అధికారిగా జి. సునీత

W.G: జిల్లా నూతన వ్యవసాయ శాఖ అధికారిగా జి. సునీత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో గుంటూరు కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేసిన ఆమె పదోన్నతిపై ఈ స్థానంలో నియమితులయ్యారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ నాగరాణిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.