ప్రకాశం: రాచర్ల మండలంలోని అన్ని విద్యుత్ ఉపకేంద్రాల పరిధిలో మంగళవారం వ్యవసాయానికి విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆ శాఖ డీఈఈ వై. శేషగిరిరావు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు. గిద్దలూరులోని 132 కేవీ ఉపకేంద్రం పరిధిలో అత్యవసర సాంకేతిక మరమ్మతులు చేపట్టడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


