హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బ్లడ్‌ క్యాన్సర్‌ బాధితురాలికి ఆర్థిక సాయం

E.G: రాజానగరం మండలం దివాన్‌చెరువు గ్రామానికి చెందిన ములపర్తి ఎస్తేరు రాణి కొంతకాలంగా బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న ఏపీ, తెలంగాణ ఉమెన్‌ రైట్స్‌ అధ్యక్షురాలు కండవల్లి లక్ష్మి ఆమెను పరామర్శించారు. అనంతరం వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 వేల నగదును అందించారు. దాతల సహకారంతో ఈ మొత్తాన్ని సేకరించినట్లు లక్ష్మి తెలిపారు.