హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

కర్నూలు నగరంలో మంగళవారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని కర్నూలు డివిజన్ ఈఈ మహేష్ కుమార్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ చర్య చేపట్టినట్లు వివరించారు. విజయా మిల్క్ డెయిరీ, మూడో పట్టణ పోలీస్ స్టేషన్, మాంటిస్సోరి పాఠశాల తదితర ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా ఉండదన్నారు.