హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

KDP: పులివెందుల పట్టణంలోని రాజారెడ్డి కాలనీ, చెన్నారెడ్డి కాలనీ, భాస్యం స్కూల్, రాజీవ్‌నగర్ కాలనీ, న్యాక్ బిల్డింగ్ ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ రమేశ్ తెలిపారు. రోడ్డు పనుల కారణంగా సరఫరాకు అంతరాయం కలుగుతుందని సోమవారం పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.