హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఐదుగురికి జరిమానా

CTR: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వారికి కోర్టు జరిమానా విధించినట్లు చిత్తూరు ట్రాఫిక్ సీఐ నరసింహ రాజు సోమవారం తెలిపారు. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 5 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతుండగా పట్టుబడటంతో కోర్టులో హాజరు పరిచామన్నారు. జడ్జి వారికి రూ.10 వేల చొప్పున రూ.50 వేల జరిమానా విధించారని పేర్కొన్నారు.