హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

కృష్ణా: తోట్లవల్లూరు మండలంలో విద్యుత్ లైన్ల మరమ్మతుల్లో భాగంగా మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ దేవదాసు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వ్యవసాయ మోటార్లకు సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు. మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేసి సకాలంలో విద్యుత్ పునరుద్ధరిస్తామని చెప్పారు.