ASR: మహిళల భద్రతకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, మహిళల రక్షణకు పటిష్ఠ చట్టాలు ఉన్నాయని కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఎస్సై కిశోర్ వర్మతో కలిసి రాజేంద్రపాలెంలో పలువురు ప్రజలు, విద్యార్థులతో మహిళల భద్రతపై ర్యాలీ నిర్వహించారు. మహిళలను ప్రతిఒక్కరూ గౌరవించాలన్నారు. మహిళల పట్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్
మహిళల భద్రతకు పటిష్ఠ చట్టాలు: కొయ్యూరు సీఐ


