హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువు తగ్గింపు'

సత్యసాయి: వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిస్తూ సిలిండర్ రీఫిల్ బుకింగ్ గడువును 45 రోజులు ఉండగా 25 రోజులకు కుదించినట్లు రామగిరి జననీ HP గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి శివరామ్ తెలిపారు. గ్రామీణ ప్రాంత వినియోగదారులు ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత గతంలో 45 రోజులు వేచి చూడాల్సి వచ్చేదని, ఇకపై 25 రోజులకే కొత్త రీఫిల్ బుక్ చేసుకోవచ్చని వెల్లడించారు.