హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

GNTR: పెదకాకాని(M) నంబూరు గ్రామానికి నిరంతర విద్యుత్ అందించేందుకు కొత్తగా 11 కేవీ లైన్ ఏర్పాటు చేయనున్నట్లు ఏఈ బ్రహ్మయ్య తెలిపారు. ఈ మేరకు 11 కేవీ ఫీడర్ పనులు చేపట్టనుండటంతో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. ఈ సమయంలో నంబూరు పరిధిలో విద్యుత్ ఉండదని, వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.