హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మ్యూజియం పనులపై అదనపు ఈవో సమీక్ష

TPT: సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జరగనున్న ఎస్వీ మ్యూజియం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ అదనపు ఈవో సీ. హెచ్. వెంకయ్య చౌదరి అధికారులను సోమవారం ఆదేశించారు. మ్యూజియంలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు, మౌలిక వసతులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. టీసీఎస్ బృందానికి అవసరమైన సమాచారం అందించాలని అన్నారు.